- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. దూసుకెళ్తున్న ఆ కంపెనీల షేర్లు
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారతదేశానికి ఎగుమతి అయ్యే అమెరికా వస్తువులపై జీరో టాక్స్ (Zero Tax) విధించాలని ప్రతిపాదించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Indices) భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారతదేశానికి ఎగుమతి అయ్యే అమెరికా వస్తువులపై జీరో టాక్స్ (Zero Tax) విధించాలని ప్రతిపాదించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Indices) భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి సెన్సెక్స్ 1,215 పాయింట్ల లాభంతో 82,545 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (NIFTY) 399 పాయింట్ల లాభంతో 25,066 వద్ద ట్రేడ్ అవుతోంది. BSE మిడ్ క్యాప్ సూచీ సుమారు 0.5 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ సూచీ దాదాపు 1 శాతం పెరిగింది. అయితే రెండూ బెంచ్‌మార్క్‌ల కంటే తక్కువ పని తీరును కనబరిచాయి. ముఖ్యంగా హీరో మోటోకార్ప్, జేఎస్‌డబ్ల్యూ, మైక్రోటెక్ దేవల్, హెడ్‌డీఎఫ్‌సీ, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, నాల్కో, వోడాఫోన్ ఐడియా షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నారు. ఇక ముథూట్ ఫైనాన్స్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, బీఎస్‌ఈ లిమిటెడ్, సీఈఎస్‌ఈ, చంబల్ ఫర్ట్ సంస్థలు షేర్లు ఘోరంగా నష్టాల్లో ట్రేడ్ కొనసాగుతున్నాయి.






