భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్లు నష్టపోయిందంటే?

by Kema Shiva Kumar |

పశ్చిమ ఆసియాలో (West Asia) ఇరాన్ (Iran), ఇజ్రాయెల్ (Israel) మధ్య భీకర వాతావరణం నెలకొన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్లు నష్టపోయిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో (West Asia) ఇరాన్ (Iran), ఇజ్రాయెల్ (Israel) మధ్య భీకర వాతావరణం నెలకొన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం 11.45 సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 671 పాయింట్ల నష్టంతో 80,020 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ (NIFTY) 203 పాయింట్ల నష్టంతో 24,684 వద్ద కొనసాగుతోంది. ఇక కంపెనీల షెర్ల విషయానికి వస్తే.. L&T, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఎస్‌సీఐ, జూబీలాంట్ ఇన్‌గ్రేవియా, డీజీ రియల్టీ, జీఈ షిప్పింగ్, జెన్ టెక్, ఫినోలెక్స్ ఇండెక్స్, కరూర్ వైశ్య బ్యాంక్, బీఈఎంఎల్, అయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్లు అనూహ్యంగా లాభాల బాటపట్టాయి.

Next Story