- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSE: 2025లో ట్రేడింగ్ సెలవుల తేదీలను ప్రకటించిన బీఎస్ఈ
by S Gopi |
2025 కేలండర్ ఏడాదికి సంబంధించి మొత్తం 14 ట్రేడింగ్ సెలవులను ఉంటాయని బీఎస్ఈ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్ల 2025 కేలండర్ ఏడాదికి సంబంధించి మొత్తం 14 ట్రేడింగ్ సెలవులను ఉంటాయని బీఎస్ఈ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. అందులో ఫిబ్రవరి, మే, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒక్కోటి చొప్పున, మార్చి, ఆగష్టు నెలల్లో రెండు, ఏప్రిల్, అక్టోబర్‌లలో మూడు ట్రేడింగ్ హాలిడేస్ ఉంటాయి. కొత్త ఏడాదిలో మొదటి ట్రేడింగ్ సెలవు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ఉంటుంది. ప్రధాన సెలవులైన రిపబ్లిక్ డే, శ్రీరామ నవమి, బక్రీద్, మొహర్రం పండుగలు శని లేదా ఆదివారాల్లో రావడంతో ఈ తేదీల్లో అదనలు సెలవులు ఉండవు. దీపావళి పండుగ సందర్భంగా ముహురత్ టేడింగ్ 2025, అక్టోబర్ 21న జరగనుంది. ఆరోజున ప్రత్యేక టేడింగ్‌కు సంబంధించి సమయం గురించి వివరాలను ఎక్స్ఛేంజీలు తర్వాత తెలియజేయనున్నాయి.
Next Story






