Stock Market: వారెవ్వా హ్యాట్రిక్ లాభాలు.. భారీగా పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ

by Kema Shiva Kumar |

స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. బ్యాంకింగ్ షేర్ల జోరుతో దలాల్ స్ట్రీట్‌లో సందడి నెలకొంది.

Stock Market: వారెవ్వా హ్యాట్రిక్ లాభాలు.. భారీగా పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల బాటలో పయనించాయి. ఇవాళ ట్రేడింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సూచీలు ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. సెన్సెక్స్ ఏకంగా 633 పాయింట్లు జంప్ చేసి 76,704 పాయింట్ల వద్ద, ఇక నిఫ్టీ 196.65 పాయింట్లు లభపడి 23,777కు చేరుకుని సరికొత్త ల్యాండ్‌మార్క్‌ను చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాలు, గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, ఆర్థిక వృద్ధి రేటుపై అంచనాలు మెరుగుపడటంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. భారీ వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా ఈ లాభాల్లో కీలక పాత్ర పోషించాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగాలు నేటి ట్రేడింగ్‌లో టాప్‌లో నిలిచాయి.

Next Story