Stock market crash: ఎంత పని చేశావు ట్రంప్‌ మావా.. ఆ ఒక్క పనితో స్టాక్‌ మార్కెట్లను క్రాష్‌ చేసి పడేశావుగా!

by Vennela |

Stock market crash: సోమవారం ట్రేడింగ్ సెషన్ లో దేశీయ స్టాక్ మార్కెట్స్ పతనమయ్యాయి.

Stock market crash: ఎంత పని చేశావు ట్రంప్‌ మావా.. ఆ ఒక్క పనితో స్టాక్‌ మార్కెట్లను క్రాష్‌ చేసి పడేశావుగా!
X

దిశ,వెబ్‌డెస్క్: Stock market crash: సోమవారం ట్రేడింగ్ సెషన్ లో దేశీయ స్టాక్ మార్కెట్స్ పతనమయ్యాయి. రూపాయి కనిష్ట స్థాయిని తాకింది. ఇలా జరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం.

దేశీయ స్టాక్ మార్కెట్లపై ట్రంప్ రూపంలో పిడుగుపడింది. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై టారీఫ్స్ విధిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతోపాటు దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం ట్రేడింగ్ సెషన్ లో క్రాష్ అయ్యాయి. రూపాయి కూడా ఆల్ టైమ్ లోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలేంటో చూద్దాం.

శనివారం ట్రేడింగ్ సెషన్లో 77, 506 వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ సెషన్లో 77, 064 దగ్గర ప్రారంభమైంది. అనంతరం 76,756 దగ్గర ఇంట్రాడే లోని హిట్ చేసిన ఉదయం 11గంటల సమయంలో దాదాపు 500 పాయింట్ల నష్టంతో 77, 007దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50, శనివారం 23,482 దగ్గర క్లోజ్ అయ్యి సోమవారం 23,319 దగ్గర ఓపెన్ అయ్యింది. 23,222 దగ్గర ఇంట్రాడేలోని నమోదు చేసి ఉదయం 11గంటల సమయంలో 181 పాయింట్ల నష్టంతో 23,301దగ్గర ట్రేడ్ అవుతోంది.

బలహీన అంతర్జాతీయ సంకేతాలపై భారత స్టాక్ మార్కెట్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వ్రుద్ధిపై ప్రభావం చూపే విస్త్రుత వాణిజ్య యుద్ధం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ప్రధాన ఆసియా మార్కెట్లు సోమవారం పతనం అవుతున్నాయి. జపాన్ కు చెందిన నిక్కీ, కొరియాకు చెందిన కోస్పీ 3శాతం చొప్పున నష్టాలను చూశాయి.

మెక్సికో, కెనడాలపై విధించిన 25శాతం సుంకాలు విధించడం...ఇమ్మిగ్రేషన్, అక్రమ వ్యాపారం వంటి సమస్యలకు శిక్ష అని అర్ధం చేసుకోవాలి. ట్రంప్ మళ్లీ ఇతర దేశాలపైనా సుంాలను ప్రయోగించే ఛాన్స్ కూడా ఉంది. 10శాతం సుంకాల విషయంలో చైనా ప్రతిస్పందన మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. మెక్సికో, కెనడా మాదిరిగా ప్రస్తుతానికి వారు సుంకాల పెంపు విధానం అనుసరించడంలేదు. బదులుగా వారు అమెరికా చర్యకు వ్యతిరేకంగా డబ్ల్యూటీఓను ఆశ్రయిస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు.

అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ సోమవారం రికార్డు స్థాయి కనిష్టం దగ్గర ప్రారంభం అయ్యింది. కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ భారీ సుంకాలు విధించడంతో డాలర్ మరింత బలపడింది. డాలర్ ఇండెక్స్ 109.6కు పెరగడం ఎఫ్ఐఐలు మరింత అమ్మకాలను ప్రేరేపిస్తుందని ఇది మార్కెట్ ను ఒత్తిడికి గురిచేస్తుందని విజయ్ కుమార్ తెలిపారు.

కేంద్ర బడ్జెట్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఫిబ్రవరి 5న ప్రారంభం అయ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై పడింది. ఆర్బిఐ ఈసారి 25బేసిస్ పాయింట్స్ మేర రేట్లను తగ్గిస్తుందని అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతర అమ్మకాలు దేశీయ స్టాక్ మార్కెట్ల తిరోగమనానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అక్టోబర్ 2024 నుంచి ఎఫ్ఐఐలు స్థిరంగా భారతీయ ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను భారీగా ప్రభావితం చేస్తోంది. అక్టోబర్ 1,2024 నుంచి ఫిబ్రవరి 1,2025 మధ్య ఎఫ్ఐఐలు దాదాపు రూ. 2.7లక్షల కోట్ల విలువైన భారతీయ స్టాక్స్ ను డంప్ చేశారు.

Next Story