- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్క రోజే 10 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు ఏంటంటే?
Stock Market: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒక్కరోజులోనే రూ. 10లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: Stock Market: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒక్కరోజులోనే రూ. 10లక్షల కోట్లు ఆవిరయ్యాయి. స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా పతనం అయ్యేందుకు పలు ఆర్థిక, ప్రపంచ భౌగోళిక అంశాలను నిపుణులు కారణంగా చూపుతున్నారు. స్టాక్ మార్కెట్ల(Stock Market) పతనానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
గత కొన్నిరోజులుగా స్టాక్ మార్కెట్(Stock Market) నష్టాల్లోనే నడుస్తోంది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్(Sensex) దాదాపు 1700పాయింట్ల క్షీణించింది. నిఫ్టీ(Nifty) 500పాయింట్లు పతనం అయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు రూ. 14లక్షల కోట్లను కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 10లక్షల కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. సెన్సెక్స్ 1,000కిపైగా పాయింట్ల నష్టంతో 76,356 వద్ద ట్రేడ్ అవుతుండగా..నిఫ్టీ 305 పాయింట్లను కోల్పోయింది.
మిడ్ క్యాప్(Mid-cap), స్మాల్ క్యాప్(Small cap) స్టాక్స్ మరింత పెద్ద నష్టాలను చవిచూశాయి. ఒక్కొక్కటి 2శాతానికిపైగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయ్యేందుకు పలు ఆర్థిక, ప్రపంచ భౌగోళిక అంశాలను నిపుణులు కారణంగా చూపిస్తున్నారు. ఆ ఐదు కారణాలేంటో చూద్దాం.
స్టాక్స్ అమ్మేస్తోన్న విదేశీ ఇన్వెస్టర్లు:
విదేశీ ఇన్వెస్టర్లు 2024 అక్టోబర్ నుంచి భారతీయ స్టాక్స్(Indian stocks) ను ఎక్కువగా విక్రయిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అమెరికా బాండ్ ఈల్డ్(US bond yield) లు పెరుగుతుండటంతో అమెరికన్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆకర్షణీయంగా మారాయి. అమెరికా డాలర్ బలపడుతుండటంతో భారత మార్కెట్లపై విదేశీయులకు ఆసక్తి తగ్గుతోంది. అలాగే అమెరికా వడ్డీ రేటు(US interest rate) తగ్గింపు సంకేతాలు కనిపించడం లేదు. అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు భారత్ స్టాక్స్ నుంచి రూ. 2.75లక్షల కోట్లకుపైగా ఉపసంహరించుకున్నారు. ఇది మార్కెట్ ను మరింత దిగజార్చింది.
రూపాయి విలువ పతనం
అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి(Indian Rupee) భారీగా పడిపోతోంది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. సోమవారం రూపాయి డాలర్ కు 88కి పడిపోయింది. ఈ ఏడాది 3శాతం క్షీణతను నమోదు చేసింది. రూపాయి బలహీనంగా మారుతుండటంతో విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి వెళ్తున్నారు. మంగళవారం, రూపాయి కొద్దిగా కోలుకుని డాలర్ కు 86.84కి చేరింది. అయితే స్థిరత్వం గురించి ఆందోళనలు మాత్రం అలాగే ఉన్నాయి.
మూడో త్రైమాసికంలో తగ్గిన కంపెనీల ఆదాయం
గత రెండు త్రైమాసికాల కంటే భారతీయ కంపెనీల డిసెంబర్ త్రైమాసికం ఆదాయాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ అవి అంచనాలను అందుకోలేకపోయాయి. అలానే చాలా స్టాక్స్ హైయర్ వాల్యుయేషన్(Stocks Higher Valuation) లో ఉన్నాయి. బలమైన లాభాలను అందించడంలోనూ విఫలమయ్యాయి. కన్సూమర్ గూడ్స్, ఆటో, బిల్డింగ్ మెటీరియల్ రంగాల ఫలితాలు ఊహించిన దానికంటే దారుణంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారుల్లో చాలా కంపెనీలు హైయర్ వాల్యుయేషన్ లో ఉన్నాయనే ఆందోళణ కలిగింది.
ఓవర్ వాల్యూడ్ స్టాక్స్
ఈమధ్య మార్కెట్ కరెక్షన్ జరిగినా కూడా భారతీయ స్టాక్స్ ఇప్పటికీ చాలా హైయర్ వ్యాల్యూ(Higher value)లో ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. బలహీనమైన ఫలితాలు ప్రకటించినా ఇప్పటికీ చాలా స్టాక్స్ అధిక ధరలతోనే ట్రేడ్ అవుతున్నాయి.
మార్కెట్ ఎలా ఉండబోతోంది?
రాబోయే కొద్ది నెలలు అస్థిరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ ఆదాయాలు మెరుగుపడి, అమెరికా మార్కెట్ స్థిరంగా ఉంటే భారతీయ స్టాక్స్ కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే విదేశీ పెట్టుబడిదారుల ప్రవాహం, రూపాయి బలహీనత వాణిజ్య ఉద్రిక్తతలు వంటివి మార్కెట్ ట్రెండ్స్ ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని దీర్ఘకాలిక పెట్టుబడులపై ఫోకస్ పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.






