Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

by Kema Shiva Kumar |

గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో వరుస లాభాలతో కళకళలాడిన దేశీయ స్టాక్ మర్కెట్ సూచీలు (Domestic Stock Market Indices) ఇవాళ స్వల్ప నష్టాలను ముటగట్టుకున్నాయి.

Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో వరుస లాభాలతో కళకళలాడిన దేశీయ స్టాక్ మర్కెట్ సూచీలు (Domestic Stock Market Indices) ఇవాళ స్వల్ప నష్టాలను ముటగట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు (Investors) లాభాల స్వీకరణకు ముందుకు రావడంతో మార్కెట్ అస్థిరతకు కారణమైంది. గత సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 82,643.73 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. అయితే, కొద్దిసేపటికే మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. ట్రేడింగ్ మధ్యలో సెన్సెక్స్ 82,680.79 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరగా.. అతి తక్కువగా 82,240.40 పాయింట్లకు పడిపోయింది. చివరకు 53.49 పాయింట్లు కోల్పోయి 82,391.72 పాయింట్ల వద్ద ట్రేడ్ ముగిసింది. నిఫ్టీ (NIFTY) మాత్రం స్వల్పంగా 1.05 పాయింట్లు పెరిగి 25,104.25 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక షేర్ల విషయానికి వస్తే.. నిఫ్టీ (NIFTY)లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. అదేవిధంగా ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టాలను చవిచూశాయి. రియాల్టీ ఇండెక్స్ ఒకశాతం పతనం కాగా.. ఐటీ ఇండెక్స్ 1.7 శాతానికి పెరిగింది. మీడియా ఇండెక్స్‌ ఒకశాతం వృద్ధిని నమోదు చేసింది. పవర్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.

Next Story