Stock Market: ఇన్వెస్టర్లకు బిగ్ షాక్.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-23 04:19:46  IST  )

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Stock Market: ఇన్వెస్టర్లకు బిగ్ షాక్.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామంతో లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మర్కెట్ సూచీలు (Domestic Stock Market Indices) ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కమ్ముకున్న వేళ ఇన్వెస్టర్లు (Investors) లాభాల స్వీకరణకు ముందుకు రావడంతో మార్కెట్ ఉన్నట్టుండి అస్థిరతకు లోనైంది. ఉదయం 9.30కి సెన్సెక్స్‌ (Sensex) 681 పాయింట్ల నష్టంతో 81,757 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (NIFTY) ఏకంగా 229 పాయింట్లు నష్టపోయి 24,875 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి.

ఇక షేర్ల విషయానికి వస్తే.. భారత్ ఎలక్ట్రానిక్స్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ ఎరోనాటిక్స్, అదాని పవర్, అయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, హ్యుందాయ్ మోటార్స్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా సెమెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ (Infosys), స్విగ్గీ (Swiggy), సవర్థన ఇంటర్‌నేషనల్, ఇన్ఫో ఎడ్డ్జ్, హెచ్‌సీఎల్ (HCL) టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హీరో మోటో‌కార్ప్, బ్రిటానియా ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ కార్పొరేషన్, రియలన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Next Story