SBI: టీసీఎస్‌ను దాటి దేశంలోనే నాలుగో అత్యంత విలువైన సంస్థగా ఎస్‌బీఐ

by S Gopi |

మార్కెట్ క్యాప్ రూ. 38,000 కోట్లకు పైగా పెరిగి రూ. 10.94 లక్షల కోట్లకు చేరుకుంది.

SBI: టీసీఎస్‌ను దాటి దేశంలోనే నాలుగో అత్యంత విలువైన సంస్థగా ఎస్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అరుదైన ఘనతను సాధించింది. బుధవారం కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 3.8 శాతం పుంజుకోవడంతో బ్యాంకు షేర్ ధర రూ. 1,187 వద్ద సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 38,000 కోట్లకు పైగా పెరిగి రూ. 10.94 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే నాల్గవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. తద్వారా ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను అధిగమించింది. ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 10.5 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ షేర్ ధర 2024, ఆగష్టు 30న నమోదైన రూ. 4,552 ఆల్‌టైమ్ రికార్డు గరిష్ఠం నుంచి 36 శాతం పడిపోయి, బుధవారం రూ. 2,909 వద్ద ఉంది. ఇక, ఎస్‌బీఐ కంటే ముందు, దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రూ. 19.87 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(రూ. 14.26 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్(రూ. 11.5 లక్షల కోట్లు) అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి.

Next Story