- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Starlink: సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇంకా ప్రకటించలేదని స్టార్‌లింక్ స్పష్టత
ఇది సాధారణ కాన్ఫిగరేషన్ గ్లిచ్‌గా భావించాలని తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సోమవారం దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో సైతం ధరల వివరాలు కనిపించాయి. అయితే, దీనికి సంబంధించి మంగళవారం కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. స్టార్‌లింక్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరలు వెల్లడించినట్టు వచ్చిన కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఆ ధరలు పబ్లిక్ కాదని, అవి కేవలం డమ్మీ టెస్ట్ డేటా కారణంగా కనిపించాయని వివరణ ఇచ్చింది. ఇది సాధారణ కాన్ఫిగరేషన్ గ్లిచ్‌గా భావించాలని తెలిపింది. భారత మార్కెట్లో కంపెనీ వెబ్‌సైట్ ఇంకా లైవ్‌లో లేదని, సబ్‌స్క్రిప్షన్ ధరలు అధికారికంగా తాము ప్రకటించబడలేదని స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ చెప్పారు. దీనిపై వార్తలు వచ్చిన వెంటనే పరిస్థితిని చక్కదిద్దామని, బగ్‌ను పరిష్కరించినట్టు తెలిపారు.
అయితే, తదుపరి స్టార్‌లింక్ భారత మార్కెట్లో సేవలను ప్రారంభించే అంశంపై లారెన్ డ్రేయర్ స్పందించారు. ఇప్పటికే కంపెనీ అందుకు సిద్ధంగా ఉందని, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు నియంత్రణ ప్రక్రియ చివరి దశలో ఉంది. రెగ్యులేటరీ ఆమోదం తర్వాత సేవలను ప్రారంభిస్తామని ఆమె వివరించారు. స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో భారత్‌లో ప్రజలను కనెక్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. స్టార్‌లింక్ బృందాలు ఇంటర్నెట్ సేవలతో పాటు వెబ్‌సైట్‌ను లైవ్ చేసేందుకు తుది ప్రభుత్వ అనుమతులను పొందడంపై దృష్టి సారించాయని డ్రేయర్ పేర్కొన్నారు.
మరోవైపు స్టార్‌లింక్ మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా పనులను కొనసాగుతోంది. చండీగఢ్, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై, నోయిడా వంటి నగరాల్లో వినియోగదారులకు ఉపగ్రహాలను అనుసంధానించడానికి కీలకమైన గేట్‌వే ఎర్త్ స్టేషన్‌లను స్టార్‌లింక్ ప్లాన్ చేస్తోందని పలు నివేదికలు పేర్కొన్నాయి. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అధికారికంగా ప్రారంభించిన తర్వాత స్థిరమైన, తక్కువ జాప్యంతో సేవలందించడంలో ఈ హబ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.






