Starbucks: భారత్‌లో స్టార్‌బక్స్ తొలి కార్పొరేట్ ఆఫీస్

by S Gopi |

ఈ ఏడాది చివర్లో ఆఫీస్ స్థలాన్ని ఖరారు చేసి, అనంతరం నియామక ప్రక్రియను ప్రారంభించనుంది.

Starbucks: భారత్‌లో స్టార్‌బక్స్ తొలి కార్పొరేట్ ఆఫీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రముఖ కాఫీ చైన్ దిగ్గజం స్టార్‌బక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా తొలి కార్పొరేట్ ఆఫీస్, టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు ఈ సెంటర్‌ను ప్రారంభించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఈ ఏడాది చివర్లో ఆఫీస్ స్థలాన్ని ఖరారు చేసి, అనంతరం నియామక ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖర్చులను తగ్గించే చర్యలు చేపడుతున్న స్టార్‌బక్స్, భారత్‌ను కీలక టెక్నాలజీ హబ్‌గా మార్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహిస్తున్న కొన్ని టెక్నాలజీ పనులను సంస్థ స్వయంగా చేపట్టనుంది. దీనికి సంబంధించి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆనంద్ వరదరాజన్ మాట్లాడుతూ.. థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, టెక్ కార్యకలాపాలను సొంతంగా నిర్వహిస్తామని చెప్పారు. మధ్యవర్తుల ఖర్చులను తగ్గించడం ద్వారా దీర్ఘకాలికంగా వ్యయ నియంత్రణ సాధించవచ్చని కంపెనీ ఆశిస్తోంది. గతేడాది నుంచి ఇప్పటివరకు 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన స్టార్‌బక్స్, ఇప్పుడు గ్లోబల్ వ్యాపారాన్ని మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు వ్యూహాత్మకంగా కీలక నిర్ణయం కానుంది.

Next Story