Spotify Down : ప్రపంచ వ్యాప్తంగా నిలిచి పోయిన స్పాటిఫై పాటల యాప్

by Muthe.Rajitha |

ఈ మధ్య అన్ని సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సాధారణం అయ్యింది.

Spotify Down : ప్రపంచ వ్యాప్తంగా నిలిచి పోయిన స్పాటిఫై పాటల యాప్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య అన్ని సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సాధారణం అయ్యింది. ఈ కోవలోకి తాజాగా స్పాటిఫై(Spotify) పాటల యాప్ కూడా వచ్చి చేరింది. బుధవారం సాయంత్రం నుంచి స్పాటిఫైలో పాటలు వెతకడంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని, మ్యూజిక్ ప్లే అవడం లేదని(Spotify Down) నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా భారీగా పోస్టులు పెడుతున్నారు. అయితే యాప్ హ్యాక్ అయిందన్న వార్తలను సంస్థ ఖండించింది. యాప్ ఎటువంటి హ్యాక్ కు గురికాలేదని, సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. యాప్ ను పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, సాధ్యమైనంత తొందరగా యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తామని హామీ ఇచ్చింది. అయితే యాప్ లో ఎటువంటి పాటలు ప్లే కాకపోయినా యాడ్స్ మాత్రం కొనసాగుతున్నాయని వినియోగదారులు మండిపడుతున్నారు.

Next Story