- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hero Motocorp: తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు లాంచ్ చేసిన హీరో మోటోకార్ప్
దీన్ని దేశంలో ఇథనాల్ ఆధారిత ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేసే కీలక అడుగుగా భావిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను బుధవారం రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆవిష్కరించారు. దీన్ని దేశంలో ఇథనాల్ ఆధారిత ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేసే కీలక అడుగుగా భావిస్తున్నారు. స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.82,710 కాగా, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.72,792 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ రెండు బైక్‌లు ఈ20 నుంచి ఈ85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచేలా రూపొందించారు. 97.2సీసీ ఇంజిన్ సామర్థ్యంతో లభించే రెండు మోడళ్లలో ఫ్లెక్స్-ఫ్యూయల్‌తో పాటు, ఐ3ఎస్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, కొత్త డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ట్యూబ్‌లెస్ టైర్లు, సవరించిన ఈసీయూ, అప్‌గ్రేడ్ చేసిన ఫ్యూయల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.






