- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Spicejet: ఉద్యోగులకు జీతాలివ్వని స్పైస్‌జెట్
ప్రధానంగా అసిస్టెంట్ మేనేజర్లు, అంతకంటే ఎక్కువ మంది 10–15 రోజులు ఆలస్యంగా వేతనాలు అందుకుంటున్నట్టు సమాచారం.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన సిబ్బందిలో ఎక్కువమందికి చాలా నెలలుగా జీతాల చెల్లించడంలో ఆలస్యం చేస్తోందని పీటీఐ నివేదిక తెలిపింది. నెలకు రూ. 55,000 వరకు జీతం తీసుకుంటున్న ఉద్యోగులు ఆగస్టు జీతాలు అందుకున్నారు, కానీ అధిక జీతం ఉన్న సిబ్బంది, ప్రధానంగా అసిస్టెంట్ మేనేజర్లు, అంతకంటే ఎక్కువ మంది 10–15 రోజులు ఆలస్యంగా వేతనాలు అందుకుంటున్నట్టు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం స్పైస్‌జెట్ వార్షిక నివేదిక ప్రకారం, సంస్థలో మొత్తం 4,894 మంది శాశ్వత సిబ్బందితో సహా 6,484 మంది ఉద్యోగులున్నారు. బోర్డు ఆమోదం ప్రకారం, కంపెనీ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్‌కు ఐదేళ్ల కాలానికి రూ. 32 కోట్లను అందించింది. గతేడాది జూలై చివరి నాటికి స్పైస్‌జెట్ 18 విమానాలను నడిపింది. మొత్తం 56 విమానాలలో 38 విమానాలను నిలిపివేసింది. సెప్టెంబర్‌లో క్యూఐపీ ద్వారా రూ. 3,000 కోట్లు సేకరించినప్పుడు, ఉద్యోగుల సంబంధిత బకాయిలను క్లియర్ చేయడానికి, నిలిపివేసిన విమానాలను తిరిగి ఆపరేషన్‌లోకి తీసుకురావడానికి, కొత్త విమానాలను కొనుగోలు చేయడానికి, సాంకేతికతలో పెట్టుబడి పెట్టడానికి, కొత్త మార్కెట్లలోకి విస్తరించడానికి ఈ నిధులను ఉపయోగిస్తామని తెలిపింది. ఇటీవల కంపెనీ వెల్లడించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో రూ. 238 కోట్ల నష్టాలను వెల్లడించింది. అలాగే, కంపెనీ ఉద్యోగల ఖర్చులను అంతకుముందు ఇచ్చిన రూ. 820.86 కోట్ల నుంచి రూ. 658.61 కోట్లకు తగ్గించింది.






