ఆదాయం ఎంత దాటితే ఎంత ట్యాక్స్ చెల్లించాలి...? కన్‌ఫ్యూజ్ లేకుండా పూర్తి డీటెయిల్స్

by Gopi |
ఆదాయం ఎంత దాటితే ఎంత ట్యాక్స్ చెల్లించాలి...? కన్‌ఫ్యూజ్ లేకుండా పూర్తి డీటెయిల్స్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. ఎంత ఆదాయం ఎంత చెల్లించాల్సి ఉంటదని కొంత మేరకు కన్ ఫ్యూజ్ అవుతున్నారు. అయితే,.. ఆదాయ పన్ను విషయంలో ఈసారి కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నిచింది. దీంతోపాటు కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చేవారికి సంబంధించి ముఖ్య ప్రకటన చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను విధానానికి సంబంధించి ఈసారి కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటన్స్ దాఖలు చేసే సమయంలో కొత్త ఆదాయపు పన్ను విధానం డీఫాల్ట్ ఆప్షన్ గా వస్తుంది.

పాత పన్ను విధానంలో ఉన్నవారు ఎప్పటిలాగానే అందులో పొందుతున్న రాయితీలను మునుపటిలా కొనసాగించవచ్చు. ఒకవేళ వారు కోరుకుంటే కొత్త పన్ను పరిధిలోకి రావొచ్చు. కొత్త పన్ను విధానంలో గతంలో రూ. 5 లక్షల వరకు రిబేట్ ఇచ్చేవారు. కానీ, ఈసారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ. 7 లక్షలకు పెంచారు. రూ. 7 లక్షల వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో కూడా స్లాబ్ ల సంఖ్యను కూడా కొంతమేరకు తగ్గించారు. గతంలో 6 స్లాబ్ లు ఉండగా వాటిని 5కు కుదించారు. రూ. 3 లక్షల వరకు ఎటువంటి పన్ను విధించరు. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు 5 శాతం పన్ను విధిస్తారు.

రూ. 6 నుంచి 9 లక్షల వరకు 10 శాతం పన్ను చెల్లించాలి. రూ. 9 నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను చెల్లించాలి. రూ. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో రూ. 15 లక్షల ఆదాయం దాటిన వారికి అత్యధికంగా 30 శాతం పన్ను విధిస్తారు. ఒక వ్యక్తి ఏడాదికి రూ. 7 లక్షల ఆదాయం పొందితే, తొలి రూ. 3 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. తర్వాత రూ. 4 లక్షలకు పై స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈసారి ఆ మొత్తంపై రిబేట్ ఇచ్చారు. దీంతో రూ. 7 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రూ. 9 లక్షల వరకు వేతనం పొందుతున్నవారు ప్రస్తుతం రూ. 60 వేల పన్ను చెల్లిస్తున్నారు. ఇకపై వారు చెల్లించాల్సిన పన్ను రూ. 45 వేలు మాత్రమే. ఫలితంగా రూ. 15 వేల మేర ప్రయోజనం కలగనుంది. వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు ఉంటే పాత పన్ను విధానం ప్రకారం రూ. 1.87 లక్షల పన్ను చెల్లించాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం రూ. ఒకటిన్నర లక్షలు చెల్లించాల్సి రావొచ్చు. అత్యధిక ఆదాయపు పన్నును సర్ చార్జీ రేటును 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. పాత పన్ను విధానంలో స్టాండెడ్ డిటెక్షన్ రూ. 50 వేల నుంచి 52,500 రూపాయలకు పెంచారు.

Next Story