Economy: భారత జీడీపీ అంచనాలను పెంచిన ఎస్అండ్‌పీ

by S Gopi |

అయితే, మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ కారణంగా పెరిగే ఇంధన ధరలు ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెంచవచ్చని ఎస్అండ్‌పీ గ్లోబల్ తన నివేదికలో తెలిపింది.

Economy: భారత జీడీపీ అంచనాలను పెంచిన ఎస్అండ్‌పీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ పెంచింది. ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు, ఎగుమతుల మద్దతుతో వృద్ధి 7.1 శాతానికి పెరుగుతుందని బుధవారం ప్రకటనలో తెలిపింది. అయితే, మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ కారణంగా పెరిగే ఇంధన ధరలు ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెంచవచ్చని ఎస్అండ్‌పీ గ్లోబల్ తన నివేదికలో తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, నిరంతరం వాణిజ్య సంబంధిత అనిశ్చితుల వల్ల కలిగే నష్టాలు, వస్తువుల ధరల పెరుగుదల, వాణిజ్య, పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు భారత్‌ను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడింది. కానీ, ప్రైవేట్ వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ, పటిష్టమైన ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.6 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 20 బేసిస్ పాయింట్లు పెంచి 7.1 శాతానికి సవరించామని నివేదిక వెల్లడించింది.

Next Story