- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: ఈ ఏడాది భారత వృద్ధి 6.5 శాతం: ఎస్అండ్‌పీ అంచనా
సానుకూల రుతుపవనాలు, జీఎస్టీ సంస్కరణలు, ప్రభుత్వం పెట్టుబడులను వేగవంతం చేయడం ద్వారా గిరాకీ పుంజుకుంటుందని ఆశిస్తున్నాం.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా బలమైన డిమాండ్, పెరుగుతున్న పెట్టుబడులు, పన్ను సంస్కరణలు మద్దతిస్తాయని అభిప్రాయపడింది. మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025-26లో భారత జీడీపీ 6.5 శాతంతో స్థిరంగా కొనసాగగలదు. సానుకూల రుతుపవనాలు, జీఎస్టీ సంస్కరణలు, ప్రభుత్వం పెట్టుబడులను వేగవంతం చేయడం ద్వారా దేశీయంగా గిరాకీ పుంజుకుంటుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా దేశీయంగా ఆహార ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే బాగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 3.2 శాతం కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా పాలసీ విధానంలో సర్దుబాట్లకు అవకాశం ఉంది. ఈ ఏడాది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వచ్చే ఎంపీసీ సమావేశంలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని నివేదిక వెల్లడించింది.
ట్రంప్ సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం
నివేదిక ప్రకారం, ఆసియాలోని పలు దేశాల నుంచి దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడంతో వాణిజ్య ధోరణిలో తీవ్ర మార్పులు జరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా దెబ్బతిన్నది. అధిక టారిఫ్ వల్ల ఎగుమతుల్లో అనిశ్చితి, వృద్ధిపై ప్రభావం చూపుతాయని ఎస్అండ్‌పీ పేర్కొంది.






