Aviation: ఎయిర్‌లైన్స్‌కు లిక్విడిటీ మద్దతు ఇచ్చే అవకాశం

by S Gopi |

ప్రభుత్వం పన్ను ఉపశమన అవకాశాలను కూడా పరిశీలిస్తోందని, ఈ సమస్యపై చర్చించడానికి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు.

Aviation: ఎయిర్‌లైన్స్‌కు లిక్విడిటీ మద్దతు ఇచ్చే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల కార్యకలాపాల అంతరాయాలు విమానయాన రంగాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విమానయాన సంస్థలకు లిక్విడిటీ మద్దతు ఇవ్వాలని భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పన్ను ఉపశమన అవకాశాలను కూడా పరిశీలిస్తోందని, ఈ సమస్యపై చర్చించడానికి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి విమానయాన సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, పాకిస్తాన్ గగనతలాలు మూసివేత కారణంగా ఫ్లైట్ రూట్లు పెరిగాయి. దీనివల్ల నిర్వహణ ఖర్చులూ పెరిగాయి. ప్రధానంగా ఇంధన ఖర్చులు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వాటా దాదాపు 40 శాతం ఉంటుంది. దీంతో ఇటీవలి వీటి పెరుగుదల లాభాల మార్జిన్‌లను గణనీయంగా ప్రభావితం చేశాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం, 2026, మార్చి నాటికి ఈ ప్రాంతంలో జెట్ ఫ్యూయల్ ధరలు 85 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి.

Next Story