Google: జీమెయిల్ అడ్రస్ మార్చుకునే సదుపాయం తీసుకురానున్న గూగుల్

by S Gopi |

ఈ అప్‌డేట్‌తో యూజర్లు ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్‌తోనే కొత్త మెయిల్ పేరుకు మారవచ్చు

Google: జీమెయిల్ అడ్రస్ మార్చుకునే సదుపాయం తీసుకురానున్న గూగుల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం యూజర్లు వాడుతున్న మెయిడ్ ఐడీకి సంబంధించి మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం యూజర్లు తమ ఈ-మెయిల్ అడ్రస్‌ను మార్చుకునే అవకాశం లేదు. అవసరం అనుకుంటే కొత్త అకౌంట్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు గూగుల్ క్రమంగా ఇప్పటికే ఉన్న అకౌంట్లనే మార్పు చేసుకునే వీలు కల్పించనుంది. ఈ అప్‌డేట్‌తో యూజర్లు ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్‌తోనే కొత్త మెయిల్ పేరుకు మారవచ్చు. అలా మార్పులు చేసిన తర్వాత, పాత జీమెయిల్ అకౌంట్ అడ్రస్‌కు మారుపేరుగా మాత్రమే ఉంటుంది. కాబట్టి, పాత, కొత్త మెయిల్ అడ్రస్‌లకు పంపిన ఈమెయిల్స్ ఒకే ఇన్‌బాక్స్‌కు వస్తాయి. యూజర్లు ఏ మెయిల్ ఐడీనైనా ఉపయోగించి గూగుల్ సర్వీసెస్ కోసం సైన్-ఇన్ అవ్వొచ్చు. అయితే, మెయిల్ అడ్రస్ మార్పు వల్ల ఎలాంటి డేటా నష్టం ఉండదని, అన్ని ఈమెయిల్, ఫోటోలు, ఫైల్స్, మెసేజెస్, యాప్ డేటా అలాగే ఉంటుంది. పాత జీమెయిల్ అడ్రస్ యూజర్‌కే ఉంటుందని, దాన్ని ఇంకొకరెవరూ వాడుకోలేరని గూగుల్ స్పష్టం చేసింది. అయితే, మెయిల్ అడ్రస్ మార్పునకు సంబంధించి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. మెయిల్ అడ్రస్ మార్చిన తర్వాత యూజర్లు దన్ని 12 నెలల పాటు మళ్లీ మార్చుకునే, తొలగించే అవకాశం ఉండదు. ఏ అకౌంట్ అయినా దాని జీమెయిల్ అడ్రస్‌ను మూడుసార్లు మాత్రమే మార్చుకునే వీలుంటుందని గూగుల్ పేర్కొంది.

Next Story