- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sony: ఫెస్టివల్ సేల్ కింద పీఎస్5పై రూ. 5 వేలు తగ్గించిన సోనీ
పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా డిజిటల్, ఫిజికల్ ఎడిషన్‌లపై రూ. 5,000 తగ్గింపు ఇస్తున్నట్టు వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ సోనీ దేశంలో మొదలైన పండుగ సీజన్ కోసం ప్రత్యేక 'ఫెస్టివల్ సేల్ ' ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా గేమింగ్ ప్రియుల కోసం 'పీఎస్5'పై భారీ డిస్కౌంట్‌తో శుభవార్త తీసుకొచ్చింది. పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా డిజిటల్, ఫిజికల్ ఎడిషన్‌లపై రూ. 5,000 తగ్గింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. సోమవారం మొదలైన ఫెస్టివల్ సేల్ నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ డిస్కౌంట్ ధరకు పీఎస్5 లభిస్తుందని సోనీ ఇండియా తెలిపింది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, ఈ ఆఫర్ రెండు పీఎస్5 మోడళ్లకు వర్తిస్తుంది. పీఎస్5 ఫిజికల్ ఎడిషన్ రూ. 5 వేల తగ్గింపుతో రూ. 54,990 నుంచి రూ. 49,990కి తగ్గింది. అలాగే, పీఎస్5 డిజిటల్ ఎడిషన్ రూ. 44,990 నుంచి రూ. 49,990కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ అక్టోబర్ 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింక్ఇట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, సోనీ సెంటర్, దేశంలోని అధీకృత ప్లేస్టేషన్ రిటైలర్ల వద్ద స్టాక్ ఉన్నంత వరకు డిస్కౌంట్ ధరకు లభిస్తాయని పేర్కొంది.






