Economy: అమెరికాతో టారిఫ్ సమస్యలకు 8-10 వారాల్లో పరిష్కారం: సీఈఓ అనంత నాగేశ్వరన్

by S Gopi |

ప్రస్తుతానికి ఇవి సానుకూలంగానే ఉన్నాయి. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలతో వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయి

Economy: అమెరికాతో టారిఫ్ సమస్యలకు 8-10 వారాల్లో పరిష్కారం: సీఈఓ అనంత నాగేశ్వరన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ప్రభుత్వం విధించిన అధిక సుంకాలు మరో రెండు నెలల్లో పరిష్కారమవుతాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. గురువారం కోల్‌కతాలో జరిగిన భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇవి సానుకూలంగానే ఉన్నాయి. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలతో వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన అదనపు 25 శాతం టారిఫ్‌పై తుది నిర్ణయం తీసుకోవడమే కాకుండా పరస్పర సుంకాల రేటును ఇప్పుడున్న 25 శాతం నుంచి దాదాపు 10-15 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. రాబోయే 8-10 వారాల్లోగా భారతీయ వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్‌కు పరిష్కారం లభిస్తుందని అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఏడాది ఆగష్టులో అమెరికా భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరుకుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తోంది. అమెరికా నిర్ణయం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా జూలైలో 8.01 బిలియన్ డాలర్లు(రూ. 70 వేల కోట్ల) నుంచి ఆగష్టులో 6.86 బిలియన్ డాలర్ల(రూ. 60 వేల కోట్ల)కు చేరాయి.

Next Story