Gold: మళ్లీ పెరుగుతున్న బంగారం

by S Gopi |

ఇటీవల పతనం తర్వాత ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో ధరలు పెరిగాయి.

Gold: మళ్లీ పెరుగుతున్న బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బుధవారం పసిడి ధరలు దాదాపు 5 శాతం మేర పెరిగాయి. వెండి కూడా అదే స్థాయిలో పుంజుకున్నాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సహా భౌగోళిక రాజకీయ పరిణామాలతో ముడి చమురు ధరలు దిగిరావడం, కీలక అమెరికా కరెన్సీ డాలర్ విలువ క్షీణించడం, ఇటీవల పతనం తర్వాత ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం రూ. 1,49,700కి చేరుకుంది. వెండి రూ. 11,250 మేర ఎగబాకడంతో కిలో రూ. 2.41 లక్షలకు పెరిగింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 3,760 పెరిగి రూ. 1,47,670కి, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 2,760 పెరిగి రూ. 1,35,450గా ఉంది. వెండి రూ. 15 వేలు పెరగడంతో కిలో రూ. 2.60 లక్షలకు చేరింది. గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ 2 శాతం పెరిగి ఔన్స్ 4,549.55 డాలర్లకు, సిల్వర్ ఔన్స్ 72.42 డాలర్లుగా ఉంది.

Next Story