Silver Rate: వెండికి డిమాండ్.. కొత్త గరిష్ఠాలకు ధరలు

by S Gopi |

హైదరాబాద్‌లో మార్కెట్లో అన్ని పన్నులు కలుపుకుని కిలో వెండి రూ. 1,18,000కు పైగా ఉంది.

Silver Rate: వెండికి డిమాండ్.. కొత్త గరిష్ఠాలకు ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వెండికి డిమాండ్ ఊపందుకుంటోంది. గతవారం రెండు రోజుల వ్యవధిలోనే రూ. 5 వేలకు పైగా పెరిగిన సిల్వర్ రేటు సోమవారం మరో రూ. 1,000 పెరిగింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధానిలో కిలో వెండి రూ. 1,08,100కి చేరుకుంది. గత శనివారం వెండి కిలో రూ. 1,07,100(అన్ని పన్నులు కలుపుకుని) వద్ద ఉంది. హైదరాబాద్‌లో మార్కెట్లో అన్ని పన్నులు కలుపుకుని కిలో వెండి రూ. 1,18,000కు పైగా ఉంది. గ్లోబల్ మార్కెట్లలోనూ వెండి ఔన్సుకు 1 శాతం మేర పెరిగి 36.30 డాలర్లుగా ఉంది. పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలహీనపడుతున్న డాలర్ మారకం విలువం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈవీ, సౌర విద్యుత్ రంగాల నుంచి గిరాకీ అధికంగా ఉండటంతో వెండి ధరలు రోజురోజుకు కొత్త గరిష్ఠాలను అధిగమిస్తోందని ఆభరణాల వ్యాపారులు తెలిపారు. ఇక, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 280 తగ్గి రూ. 97,780(అన్ని పన్నులు కలిపి)కి చేరాయి. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 250 తగ్గి రూ. 89,550 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు కొంత పెరిగి రూ. 3,312.84 డాలర్లకు చేరుకుంది. తాజాగా అమెరికా, చైనా మధ్య అందరూ ఆశిస్తున్నట్టుగా టారిఫ్‌లపై సానుకూల చర్చకు అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు రావడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం గిరాకీని తగ్గిచవచ్చని, అందుకే ధరల్లో స్వల్పంగా వ్యత్యాసం కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.

Next Story