ఊహించని స్థాయిలో పెరిగిన వెండి ధరలు

by Malleboina Mahesh |   (  Updated:2025-09-27 07:34:36  IST  )

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తో పాటు వెండి కూడా ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వారంలో ఒకటి రెండు సార్లు తగ్గినప్పటికీ, రేట్ల పెరుగుదలలో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.

ఊహించని స్థాయిలో పెరిగిన వెండి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తో పాటు వెండి ధరలు (Silver prices) కూడా భారీగా పెరుగుతున్నాయి. వారంలో ఒకటి రెండు సార్లు తగ్గినప్పటికీ, రేట్ల పెరుగుదలలో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. తాజాగా శనివారం మధ్యాహ్న.. వెండి ధర ఊహించని స్థాయిలో పెరిగి అందరికి షాక్ ఇచ్చింది. ఒక్కరోజులో రూ. 7 వేలు పెరిగి.. కేజీ వెండి ధర రూ. లక్షన్నరకు దాటింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ ధర (Ounce Price) 46.5 డాలర్లుగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల, ఉత్పత్తి లోపం, వినియోగం అధికం కావడం, అలాగే రూపాయి-డాలర్ మార్పిడి విలువ ప్రభావం కలిసి దేశీయంగా వెండి రేట్లు భారీగా ఎగబాకడానికి కారణమయ్యాయి.

పండుగల సీజన్ డిమాండ్ కూడా ఈ పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం సాదా వెండి ఆభరణాల దిగుమతులపై పరిమితులు విధించింది. దీని ఉద్దేశ్యం స్థానిక పరిశ్రమలను రక్షించడం అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వెండి ధరల పెరుగుదలతో ఆభరణాల వ్యాపారులు, వినియోగదారులు కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, పెట్టుబడిదారులకు మాత్రం ఇది లాభదాయకమైన అవకాశంగా మారింది. నిపుణులు ఈ పరిస్థితి వచ్చే నెలలో కూడా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వెండి ధరల పెరుగుదల ఇలానే కొనసాగితే.. ఇకపై వెండిని కొనడం కూడా కష్టతరం అయ్యేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story