- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంసీఎక్స్‌లో వెండి ధర 6 శాతం పతనం.. ఇన్వెస్టర్లలో మొదలైన గుబులు
ఇన్నాళ్లు హద్దులు లేకుండా దూసుకుపోయిన వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

దిశ, వెబ్‌డెస్క్: హద్దులు లేకుండా దూసుకుపోయిన వెండి (Silver) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎంసీఎక్స్ (Multi Commodity Exchange) మార్కెట్‌లో వెండి ధరలు ఒకే రోజు సుమారు 6 శాతానికి పతనమై అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీంతో కిలో వెండి ధర తన రికార్డు స్థాయి నుంచి భారీగా దిగిరావడంతో ఇన్వెస్టర్లలో గుబులు మొదలైంది. జనవరిలో రూ.4.20 లక్షల గరిష్ట స్థాయిని తాకిన వెండి, ఫిబ్రవరి మొదటి వారంలో ఏకంగా రూ.1.94 లక్షల వరకు పడిపోయింది. అమ్మకాల ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందంటే, మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ లోయర్ సర్క్యూట్ (Lower Circuit)ను తాకాయి.
హెల్తీ కరెక్షన్ అంటున్న ఆర్థిక నిపుణులు..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) కొత్త చైర్మన్‌గా కెవిన్ వార్ష్ (Kevin Warsh) నియామకం జరిగే అవకాశం ఉందన్న వార్తలతో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఇది బంగారం, వెండి ధరలపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. గత నెలలో వెండి ధరలు 150 శాతానికి పైగా పెరగడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాలను స్వీకరించడం ప్రారంభించారు. అదేవిధంగా మరోవైపు 2026 కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి సుంకాలపై వచ్చిన ఊహాగానాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలు (CME) వెండిపై మార్జిన్ అవసరాలను పెంచడంతో ట్రేడర్లు తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించాల్సి వచ్చింది. ఇంత భారీ పతనం సంభవించినప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ పరిణామాన్ని హెల్తీ కరెక్షన్‌గా పేర్కొనడం గమనార్హం.






