దూసుకుపోతున్న వెండి ధర.. కిలో రూ.2.32 లక్షలు

by Muthe.Rajitha |   (  Updated:2025-12-26 05:55:34  IST  )

వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

దూసుకుపోతున్న వెండి ధర.. కిలో రూ.2.32 లక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.8,951 పెరిగి రూ.2,32,741కు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర $75గా ఉంది. డిసెంబర్ 18 నుంచి ఇప్పటివరకు చూస్తే కిలో వెండి ధర మొత్తం రూ.29,176 పెరగడం గమనార్హం. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1.42 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనత, సోలార్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాల్లో ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం, సేఫ్‌ హెవెన్ పెట్టుబడులపై ఆసక్తి పెరగడం వంటి అంశాలు వెండి, బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ధరలు ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Related News : మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు రూ.9 వేలు పెరిగిన ధరలు

Next Story