Today's Gold Price:మళ్లీ పెరిగిన వెండి ధర.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-12 17:13:18  IST  )

ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,19,550 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.300 తగ్గి రూ. 1,19,250గా ఉంది. అలాగే నిన్న రూ.1,30,420 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.330 తగ్గి రూ.1,30,090 గా ఉంది.

Todays Gold Price:మళ్లీ పెరిగిన వెండి ధర.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,19,550 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.300 తగ్గి రూ. 1,19,250గా ఉంది. అలాగే నిన్న రూ.1,30,420 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.330 తగ్గి రూ.1,30,090 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ. 1,99,000గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,19,250

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,30,090

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,19,250

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,30,090

Next Story