Silver: మళ్లీ రూ. 16 వేలు పెరిగిన వెండి

by S Gopi |

మంగళవారం బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ. 15,940 పెరిగి రూ. 2.40 లక్షలకు చేరుకుంది.

Silver: మళ్లీ రూ. 16 వేలు పెరిగిన వెండి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతకుముందు సెషన్‌లో భారీ పతనాన్ని చూసిన వెండి, మంగళవారం మరోసారి దూసుకెళ్లాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, మంగళవారం బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ. 15,940 పెరిగి రూ. 2.40 లక్షలకు చేరుకుంది. జీఎస్టీ ఇతర పన్నులు కలుపుకుంటే రెటైల్ మార్కెట్లో ఇది రూ. 2.49 లక్షల వరకు ఉండొచ్చు. వెండిపై చైనా ఎగుమతుల ఆంక్షలు విధించడం, భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, కనిష్టాల వద్ద కొనుగోళ్ల ధోరణి కారణంగా మళ్లీ పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక డిమాండ్ కూడా ఇందుకు కారణం కావొచ్చని పేర్కొన్నారు. ఇక, బంగారానికి సంబంధించి ధరలు వరుసగా రెండో రోజు కూడా క్షీణించాయి. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 3,050 తగ్గి రూ. 1,36,200కి (అన్ని పన్నులతో కలిపి) చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 2,800 పడిపోయి రూ. 1,24,850కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ వెండి 5 శాతం మేర క్షీణించి 75.85 డాలర్లకు చేరగా, బంగారం ఔన్స్ 4,401.59 డాలర్లుగా ఉంది.

Next Story