- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Silver: కొత్త గరిష్టాలకు చేరిన బంగారం, వెండి ధరలు
వెండి ధరలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. సోమవారం దేశ రాజధానిలో వెండి ధరలు ఏకంగా రూ.7,000 పెరిగి కిలోకు రూ.1.50 లక్షలకు చేరుకోగా, బంగారం కూడా రూ.1,19,500కు చేరుకుని కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. వెండి ధరలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 1.60 లక్షల(అన్ని పన్నులు కలిపి)కు చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ. 920 పెరిగి 10 గ్రాములకు రూ.1,19,964 (అన్ని పన్నులతో సహా)గా ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 850 పెరిగి రూ. 1,07,831(అన్ని పన్నులతో సహా)కి చేరింది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. బంగారం, వెండి రెండూ భారీగా పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ దాదాపు 2 శాతం పెరిగి ఔన్సు 3,824.61 డాలర్లకు ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. వెండి ఔన్సు 2 శాతం కంటే ఎక్కువగా పెరిగి 47.18 డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా అమెరికా డాలర్ బలహీనపడటం, అమెరికా ఫెడ్ రేట్ల కోత అంచనాలు, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, వెండికి పారిశ్రామికంగా అధిక డిమాండ్ ఏర్పడటం, వెండి సరఫరా తగ్గడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, రూపాయి విలువ బలహీనపడటం వంటి అంశాలు వెండి, బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.






