Silver: కొత్త గరిష్ఠాలకు వెండి ధరలు

by S Gopi |

గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే వెండి ధరలు రూ. 5,000 కంటే ఎక్కువ పెరిగింది.

Silver: కొత్త గరిష్ఠాలకు వెండి ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇన్నాళ్లు బంగారం ధరలు కొనలేనంత భారీగా పెరుగుతూ వచ్చాయి. పసిడి బాటలోనే ఇప్పుడు వెండి కూడా వడివడిగా పెరుగుతోంది. శుక్రవారం దేశ రాజధానిలో స్థానిక ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల కొనుగోళ్ల కారణంగా వెండి ధరలు రూ.3,000 పెరిగి కిలోకు రూ.1,07,100(అన్ని పన్నులతో సహా)కు చేరుకున్నాయి. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే వెండి ధరలు రూ. 5,000 కంటే ఎక్కువ పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు రూ. 18,000 వరకు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు కిలోకు రికార్డు స్థాయిలో రూ. 1,18,000 చేరుకున్నాయి. దేశీయ డిమాండ్ పెరగడమే కాకుండా అంతర్జాతీయ పరిణామాల కారణంగా వెండి ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ సిల్వర్ ఔన్సుకు 1.63 శాతం పెరిగి 36.23 డాలర్లకు చేరుకుంది. సరఫరా-డిమాండ్ ఫండమెంటల్స్ మెరుగుపడటం, పెట్టుబడిదారుల ఆసక్తి వల్లే వెండి ధర 13 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ వెల్లడించింది. ఇక, బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల ధర రూ. 99,670 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల ధర రూ. 91,300 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,351 డాలర్లుగా ఉంది.

Next Story