- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shriram Finance: ఎఫ్‌డీలపై వడ్డీ తగ్గించిన శ్రీరామ్ ఫైనాన్స్
రూ. 10 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై, 12 నెలల కాలపరిమితికి సంబంధించిన వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ శ్రీరామ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించింది. సవరించిన రేట్లు మే 6వ తేదీని నుంచి అమల్లోక్ వస్తాయని ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. రూ. 10 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై, 12 నెలల కాలపరిమితికి సంబంధించిన వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గించింది. 15 నెలల (కేవలం డిజిటల్ విధానంలో చేసేవి) విభాగంలో వడ్డీ రేట్లను 7.25 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గించగా, 18 నుంచి 23 నెలల కాలపరిమితికి సంబంధించిన రేట్లు 7.15 శాతం నుంచి 7 శాతంగా సవరించింది. 24-35 నెలల కాలపరిమితికి సంబంధించిన రేట్లను 7.25 శాతం నుంచి 7.05 శాతానికి, 36-60 నెలల కాలపరిమితిపై 7.60 శాతం నుంచి 7.25 శాతానికి భారీగా తగ్గించింది. అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజెన్లకు 0.50 శాతం, మహిళా డిపాజిటర్లకు అదనంగా 0.05 శాతం ఎక్కువ వడ్డీ పొందుతారని శ్రీరామ్ ఫైనాన్స్ వివరించింది. మెచ్యూర్ పూర్తయిన డిపాజిట్లను రెన్యూవల్ చేసిన సందర్భంలో ఏడాదికి అదనంగా 0.15 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుందని వెల్లడించింది.






