- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ వీడియో.. అడ్రస్ తప్పు పెట్టారని కస్టమర్‌ను చితకబాదిన జెప్టో డెలివరీ బాయ్
ప్రముఖ ఆన్‌లైన్ నిత్యావసర వస్తువులు డెలీవరీ చేసే జెప్టో సంస్థ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ నిత్యావసర వస్తువులు డెలీవరీ చేసే జెప్టో (Zepto) సంస్థ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కస్టమర్ (Customer) అడ్రస్ తప్పుగా పెట్టాడని జెప్టో డెలివరీ బాయ్ (Delivery boy) అతడిపై దాడిచేశాడు. మూడు రోజుల కిందట ఈ వ్యవహారం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కస్టమర్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవ్వగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
బెంగళూరులోని బసవేశ్వరనగర్ జడ్జీల కాలనీలో 30 ఏళ్ల శషాంక్ అనే వ్యాపారవేత్త మే 21లో జెప్టోలో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశారు. వాటిని డెలివరీ చేసేందుకు విష్ణువర్ధన్ అనే ఏజెంట్ వెళ్లాడు. ఆ వస్తువులు తీసుకునేందుకు శషాంక్ వదిన బయటకు వెళ్లగా, డెలివరీ అడ్రస్ తప్పుగా ఇచ్చారంటూ విష్ణువర్థన్ ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఇది గమనించిన శషాంక్ అక్కడికి వచ్చి, డెలివరీ ఏజెంట్ ప్రవర్తనను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్, శషాంక్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. కస్టమర్ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు.
ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దాడిలో శషాంక్ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై వారు కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని.. జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు జెప్టో కస్టమర్ సపోర్ట్ స్పందించింది. అలాగే బాధితుడి ఫిర్యాదు మేరకు బసవేశ్వరనగర్ పోలీసులు డెలివరీ ఏజెంట్ విష్ణువర్ధన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జెప్టో యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేసి, నిందితుడి వివరాలు, ఆరోపణలపై వివరణ కోరినట్లు పోలీసులు తెలిపారు.






