- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI వినియోగదారులకు పిడుగులాంటి వార్త.. ఇక నుంచి ఛార్జీల మోతే!
దేశీయ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న ఐఎంపీఎస్ (IMPS) నగదు బదిలీ సేవలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు 2026, ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, సాధారణంగా అత్యవసర నగదు బదిలీల కోసం వినియోగించే IMPS సేవలపై బ్యాంక్ పరిమితులను విధించింది. దీని ప్రకారం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు యోనో (YONO) యాప్ ద్వారా చేసే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రూ. 25,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ.25,001 నుంచి రూ.1,00,000 వరకు రూ.2 ప్లస్ జీఎస్‌టీ, రూ.1,00,001 నుంచి రూ. 2,00,000 వరకు రూ.6 ప్లస్ జీఎస్‌టీ, రూ.2,00,001 నుంచి రూ.5,00,000 వరకు రూ.10 ప్లస్ జీఎస్‌టీ చార్జ చయనున్నారు.
కాగా, రూ.25 వేల లోపు చేసే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించకపోవడం సామాన్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి చేసే IMPS ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. అవి పాత పద్ధతిలోనే రూ.2 నుంచి రూ.20 వరకు కొనసాగుతాయి. అదేవిధంగా డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వం, రైల్వే, పోలీసు సిబ్బందికి చెందిన శాలరీ అకౌంట్లకు, అలాగే కొన్ని ప్రత్యేక సేవింగ్స్ ఖాతాలకు మాత్రం ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. డిజిటల్ పద్ధతిలో చేసే NEFT, RTGS లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని బ్యాంక్ స్పష్టం చేసింది.






