పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెయ్యికి పైగా

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెయ్యికి పైగా
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్ నేడు భారీగా పెరిగాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.87,550 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 పెరిగి రూ.87,750 ఉంది. అలాగే నిన్న రూ.95,510గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 పెరిగి రూ.95,730 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలో రూ.1000 తగ్గి 1,08,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,730

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,730

Next Story