Gold rates: షాక్ ఇచ్చిన బంగారం.. మరోసారి పెరిగిన ధరలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-09 06:44:13  IST  )

గత ఐదు రోజులుగా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. దీంతో చాలా మంది బంగారం కొనాలని ప్లాన్ చేసుకుని ఉంటారు.

Gold rates: షాక్ ఇచ్చిన బంగారం.. మరోసారి పెరిగిన ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదు రోజులుగా బంగారం (Gold) ధరలు భారీగా దిగొచ్చాయి. దీంతో చాలా మంది బంగారం కొనాలని ప్లాన్ చేసుకుని ఉంటారు. వారందరికి ఒక్కసారిగా పసిడి ధరలు షాకిచ్చాయి. దేశంలో ఇవాళ బంగారం ధర భారీగా పెరుగగా, వెండి ఊరటనిచ్చింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 పెరుగగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.89,880 ఉండగా, బుధవారానికి రూ.90,590కు పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మంగళవారం రూ.82,400 ఉండగా, బుధవారం రూ.83,050గా ఉంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.94000కు చేరుకుంది.

ఇక హైదరాబాద్‌లో ధరలు చూసుకుంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.90,440గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే కిలో వెండి ధర రూ.1,02,000గా కొనసాగుతోంది.

అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లోని అనిశ్చితి కారణంగా దేశంలోని బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను మే నెలలో తగ్గిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Next Story