రూ. 25 లక్షల కోట్లకు సేవల ఎగుమతులు!

by Disha Web Desk 13 |
రూ. 25 లక్షల కోట్లకు సేవల ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: భారత సేవల ఎగుమతులు గణనీయమైన వృద్ధి సాధిస్తున్నాయని సేవల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఈపీసీ) అంచనా వేసింది. ఈ ధోరణి ఇదే స్థాయిలో కొనసాగితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగ ఎగుమతులు 300 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 25 లక్షల కోట్ల)ను అధిగమిస్తాయని తెలిపింది. అదేవిధంగా గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా 2030 నాటికి ఇవి రూ. లక్ష కోట్ల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

రానున్న విదేశీ వాణిజ్య విధానం(ఎఫ్‌టీపీ) చర్యలు ఎగుమతులను మరింత పెంచేందుకు దోహదపడతాయని ఎస్‌ఈపీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ సిన్హా తెలిపారు. ప్రధానంగా ఐటీ, ఐటీ సంబంధిత, టూరిజ, హెల్త్‌కేర్ రంగాల్లో మెరుగైన ఎగుమతులు నమోదవుతున్నాయి. ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం, 300 బిలియన్ డాలర్లకు చేరుకోవడం సులభమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం ఎగుమతుల్లో ఐటీ, ఐటీ సంబంధిత పరిశ్రమల వాటా 40-45 శాతం ఉంటుంది. దీని తర్వాత ప్రయాణ, పర్యాటక పరిశ్రమలు, బ్యాంకింగ్, అకౌంటెన్సీ వంటి ఆర్థిక సేవల పరిశ్రమలున్నాయి.


Next Story

Most Viewed