నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లను నష్టాలను ఎదుర్కొన్నాయి. కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ కంపెనీల షేర్లలో అమ్మకాలు భారీగా జరగడంతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు అర శాతానికి పైగా క్షీణించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే ప్రతికూలంగా మొదలైన ర్యాలీ చివరి వరకు అదే ధోరణిలోనే కొనసాగాయి. విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించినప్పటికీ గరిష్ఠాల వద్ద అమ్మకాలతో సూచీలు బలహీనపడ్డాయి. మిడ్-సెషన్ తర్వాత కొద్దిసేపు ట్రేడింగ్ తక్కువ నష్టాల్లో కదలాడినప్పటికీ చివరి గంటలో ఇన్వెస్టర్లు షేర్ల విక్రయాలను పెంచారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 413.24 పాయింట్లు కోల్పోయి 61,932 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు నష్టపోయి 18,286 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు స్వల్పంగా రాణించాయి. మీడియా, ఆటో రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, మారుతీ సుజుకి స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.21 వద్ద ఉంది.Next Story

Most Viewed