- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఇన్వెస్టర్లకు రూ. 9 లక్షల కోట్ల లాభాలు
ట్రేడింగ్‌లో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ శాంతి చర్చలు జరుగుతాయనే ప్రకటనలు దేశీయ మార్కెట్లతో పాటు గ్లోబల్ మార్కెట్లలోనూ ఉత్సాహం నింపాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ లాభాలు సాధించాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒకరోజు సెలవు తర్వాత ప్రారంభమైన ట్రేడింగ్‌లో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ శాంతి చర్చలు జరుగుతాయనే ప్రకటనలు దేశీయ మార్కెట్లతో పాటు గ్లోబల్ మార్కెట్లలోనూ ఉత్సాహం నింపాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 100 డాలర్ల లోపే ఉండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటం వంటి అంశాలు మార్కెట్ల ర్యాలీకి దోహదపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1263.67 పాయింట్లు ఎగసి 78,111 వద్ద, నిఫ్టీ 388.65 పాయింట్లు పుంజుకుని 24,231 వద్ద ముగిశాయి. ఈ క్రమంలోనే బుధవారం ట్రేడింగ్ ద్వారా ఇన్వెస్టర్లు రూ. 9 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 449 లక్షల కోట్ల నుంచి రూ. 458 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 93.42 వద్ద ట్రేడవుతోంది.






