- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: నష్టాల నుంచి లాభాలకు స్టాక్ మార్కెట్ల ర్యాలీ
ఈ క్రమంలోనే అధిక నష్టాలను చూసిన సెన్సెక్స్ మిడ్-సెషన్ సమయానికి 1,300 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలను సాధించాయి. సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు మొదలైన తొలి గంటలోనే భారీ నష్టాల్లోకి జారాయి. ఆ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందనే సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. ఈ క్రమంలోనే అధిక నష్టాలను చూసిన సెన్సెక్స్ మిడ్-సెషన్ సమయానికి 1,300 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. ముఖ్యంగా యూఎస్, ఇరాన్ కాల్పుల విరమణ ద్వారా కీలక హార్మూజ్ జలసంధిలో ప్రపంచ సరఫరా కొనసాగుతుందనే ఆశలు మార్కెట్లలో కనిపించాయి. ఇదే సమయంలో ఈ సంకేతాలతో గ్లోబల్ క్రూడ్ ధరలు కూడా దిగొచ్చాయి. సోమవారం సాయంత్రానికి బ్రెంట్ క్రూడ్ ధర 108 డాలర్లకు చేరడం, మన కరెన్సీ రూపాయి విలువ మరింత బలపడటంతో స్టాక్ మార్కెట్ల లాభాలకు మద్దతు లభించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 787.30 పాయింట్లు ఎగసి 74,106కి చేరగా, నిఫ్టీ 255.15 పాయింట్లు లాభపడి 2,968 వద్ద ముగిశాయి. భారీ రికవరీ కారణంగా మదుపర్ల సంపద సోమవారం ట్రేడింగ్‌లో రూ. 5 లక్షల కోట్ల లాభాలు చూశారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 427.51 లక్షల కోట్లకు చేరింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 93.04 వద్ద ఉంది.






