Stock Market: వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |

శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ కారణంగా బలహీనపడ్డాయి.

Stock Market: వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతకుముందు సెషన్‌లో భారీ లాభాలను చూసిన సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ కారణంగా బలహీనపడ్డాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాలకు తోడు అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల మార్కెట్ల ప్రభావం వంటి అంశాలు మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమయ్యాయి. మరోవైపు, దేశీయంగా కీలకమైన భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐటీ షేర్లు క్షీణించడం కూడా ర్యాలీపై ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 200.15 పాయింట్లు పడిపోయి 82,330 వద్ద, నిఫ్టీ 42.30 పాయింట్లు పడిపోయి 25,019 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, ఫార్మా వంటి కీలక రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎటర్నల్, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, నెస్లె ఇండియా, టాటా మోటార్స్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.61 వద్ద ఉంది.

Next Story