- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: వరుసగా నాలుగో రోజు రాణించిన సూచీలు
ప్రధానంగా దేశీయ బ్యాంకింగ్ రంగంతో పాటు ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాల ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ పరిస్థితులు కొనసాగడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లేనప్పటికీ, దేశీయ కీలక పరిణామాలు మన మార్కెట్లలో వరుస నాలుగో రోజూ అధిక లాభాలు నమోదయ్యాయి. ప్రధానంగా దేశీయ బ్యాంకింగ్ రంగంతో పాటు ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంతకుముందు రోజు భారత రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్న డేటా విడుదల కావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మన మార్కెట్లలో నిధులు పెట్టడం బాగా కలిసొచ్చింది. వీటితో పాటు అమెరికా కరెన్సీ డాలర్ విలువ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వం టారిఫ్‌ల విషయంలో సానుకూల చర్చలు జరుపుతుండటం వంటి అంశాలు మద్దతిచ్చాయి. గడిచిన రెండు రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 10 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేయడం అధిక లాభాలకు కారణమయ్యాయి. వీటి ప్రభావంతో ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ 2 వేల పాయింట్ల వరకు దూసుకెళ్లింది. ఆ తర్వాత కొంత వెనకడుగు వేసినప్పటికీ అధిక లాభాల్లోనే ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,508.91 పాయింట్లు ఎగసి 78,553 వద్ద, నిఫ్టీ 414.45 పాయింట్లు లాభపడి 23,851 వద్ద ముగిశాయి. భారీ లాభాల కారణంగా గురువారం మదుపర్ల సంపద రూ. 4 లక్షల కోట్లు పెరగ్గా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 419 లక్షల కోట్లకు చేరుకుంది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.44 వద్ద ఉంది.






