Stock Market: మళ్లీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |

కీలక జియో ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి సెబీ అనుమతి లభించడం కొంత నష్టాలను తగ్గించాయి.

Stock Market: మళ్లీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు మరోసారి భారీ నష్టాలు తప్పలేదు. అంతకుముందు సెషన్‌లో నష్టాల నుంచి కోలుకున్నట్టు కనిపించిన తర్వాత మంగళవరం ట్రేడింగ్‌లో కీలక షేర్లలో అమ్మకాల ఒత్తిడి వల్ల క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల కారణంగా ఓ దశలో సెన్సెక్స్ 1,300 పాయింట్ల మేర బలహీనపడినప్పటికీ, కీలక జియో ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి సెబీ అనుమతి లభించడం కొంత నష్టాలను తగ్గించాయి. ప్రధానంగా బుధవారం విడుదల కానున్న తయారీ, పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు ప్రభుత్వ జీడీపీ గణాంకాల విషయంలో మదుపర్ల అప్రమత్తంగా వ్యవహరించడం నష్టాలకు కారణమయ్యాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటికి తోడు కీలక ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో అమ్మకాలు కూడా కొంత ప్రతికూల ప్రభావానికి కారణం. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 624.82 పాయింట్లు పతనమై 81,552 వద్ద, నిఫ్టీ 174.95 పాయింట్లు క్షీణించి 24,826 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. అల్ట్రా సిమెంట్, ఐటీసీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.41 వద్ద ఉంది.

Next Story