- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: యుద్ధ భయాలతో భారీ నష్టాలను చూసిన స్టాక్ మార్కెట్లు
గత వారాంతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి, డ్రోన్ దాడుల తర్వాత ప్రపంచ మార్కెట్లు పతనమైన నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ మొదలవగానే దేశీయ ఈక్విటీ మార్కెట్లు దెబ్బతిన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: మన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుదేలయ్యాయి. గత వారాంతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి, డ్రోన్ దాడుల తర్వాత ప్రపంచ మార్కెట్లు పతనమైన నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ మొదలవగానే దేశీయ ఈక్విటీ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడం, ఇరాన్ ప్రతీకారంగా దాడులు విస్తృతం చేయడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు గురై అమ్మకాలకు దిగారు. ఈ క్రమలోనే ఇన్వెస్టర్లు సోమవారం ట్రేడింగ్‌లో ఒక్కరోజే రూ. 6.97 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంప్దర ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 463.91 లక్షల కోట్ల నుంచి రూ.456.94 లక్షల కోట్లకు చేరుకుంది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫలితంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, మదుపర్లు సురక్షిత సాధనాలకు నిధులను తరలించడం వంటి పరిణామాలు ఎక్కువ నష్టాలకు కారణమయ్యాయి. వీటి ప్రభావంతో ఓ దశలో సెన్సెక్స్ 2,700 పాయింట్లకు పైగా కుప్పకూలింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ, పెరిగిన అస్థిరత, ప్రపంచ అనిశ్చితి దృష్ట్యా, పెట్టుబడిదారులు మరింత అప్రమత్త వైఖరిని కొనసాగిస్తారని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1048.34 పాయింట్లు క్షీణించి 80,238 వద్ద, నిఫ్టీ 312.95 పాయింట్లు పడిపోయి 24,865 వద్ద ముగిశాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎల్అండ్‌టీ, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు సోమవారం 6 శాతం కంటే ఎక్కువ పడిపోయి సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టాలు చూశాయి. రంగాల వారీగా చూస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంకింగ్ షేర్లు ఎక్కువ నష్టపోయాయి. కీలక చమురు, ఏవియేషన్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 91.62 వద్ద ఉంది.






