- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Stock Market: మళ్లీ లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గతవారం రికార్డు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా బలహీనపడిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో రాణించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మిడ్-సెషన్ తర్వాత పుంజుకున్నాయి. అమెరికా మార్కెట్లు మాంద్యం భయాల నుంచి స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. ఈ క్రమంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోయినప్పటికీ దేశీయంగా కీలక బ్లూచిప్ స్టాక్స్‌లో మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో లాభాలు కొనసాగాయి. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లు, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ర్యాలీ కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 375.61 పాయింట్లు లాభపడి 81,559 వద్ద, నిఫ్టీ 84.25 పాయింట్ల లాభంతో 24,936 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.95 వద్ద ఉంది.