- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఐదు రోజుల లాభాలకు బ్రేక్
కాల్పుల విరమణ నేపథ్యంలో భారీ ర్యాలీ చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో వరుస ఐదు రోజుల లాభాల తర్వాత బలహీనపడ్డాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల తర్వాత నెమ్మదించాయి. అంతకుముందు రోజు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో భారీ ర్యాలీ చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో వరుస ఐదు రోజుల లాభాల తర్వాత బలహీనపడ్డాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆగినట్లే కనిపించినప్పటికీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేసింది.దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇదే సమయంలో భారీ లాభాల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా అధిక నష్టాలు నమోదయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 931.25 పాయింట్లు కోల్పోయి 76,631 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు క్షీణించి 23,775 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 92.54 వద్ద ఉంది.






