Stock Market: స్టాక్ మార్కెట్లలో రూ. 13 లక్షల కోట్లు ఆవిరి

by S Gopi |
Stock Market: స్టాక్ మార్కెట్లలో రూ. 13 లక్షల కోట్లు ఆవిరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ పరిస్థితుల కారణంగా సోమవారం మొదలైన ట్రేడింగ్ రోజంతా బలహీనంగానే కదలాడాయి. కీలక కంప్నీఎలైన ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీతో పాటు జొమాటో లాంటి షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నష్టాలకు ఆజ్యం పోశాయి. స్టాక్ మార్కెట్లలో చాలా కంపెనీలు నష్టాలను ఎదుర్కోవడంతో సోమవారం ఒక్కరోజే పెట్టుబడిదారులు దాదాపు రూ. 13 లక్షల కోట్లు నష్టపోయారని విశ్లేషకులు తెలిపారు. నష్టాలకు ప్రధానంగా చమురు ధరలు మూడు నెలల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకోవడం, పెరిగిన డాలర్ కారణంగా భారత రూపాయి జీవితకాల కనిష్ట స్థాయి రూ. 86.61కి పడిపోవడం, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విధానాలపై ఆందోళనలు, మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు వెనక్కి తీసుకోవడం, మరో రెండు రెండు వారాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం, త్రైమాసిక ఫలితాలు సహా వృద్ధిపై సందేహాల వంటి వివిధ అంశాలు సూచీలు బలహీనతకు కారణంగా నిలిచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమ్యానికి సెన్సెక్స్ 1,048.90 పాయింట్లు క్షీణించి 76,330 వద్ద, నిఫ్టీ 345.55 పాయింట్లు కుదేలై 23,085 వద్ద ముగిశాయి. నిఫ్టీలో అన్ని రంగాలు 2-7 శాతం మధ్య పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాలను సాధించాయి. మిగిలిన అన్ని స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.67 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed