వారాంతం లాభాలు సాధించిన మార్కెట్లు!

by Disha Web Desk 17 |
వారాంతం లాభాలు సాధించిన మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం లాభాలను సాధించాయి. గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో వరుస రెండు రోజుల నష్టాలను అధిగమించి సూచీలు ర్యాలీ చేశాయి. శుక్రవారం ఉదయం నుంచే సానుకూలంగా మొదలైన ట్రేడింగ్ మిడ్-సెషన్ సమయంలో కొంతసేపు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది.

అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా మే నెలకు సంబంధించి ఆటో అమ్మకాలు మెరుగ్గా ఉండటం, జీఎస్టీ ఆదాయం అధికంగా నమోదవడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 118.57 పాయింట్లు లాభపడి 62,547 వద్ద, నిఫ్టీ 46.35 పాయింట్లు పెరిగి 18,534 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాలు రాణించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా, ఎల్అండ్‌టీ, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.30 వద్ద ఉంది.

Also Read..

కొత్త లైట్‌వెయిట్ ట్రాక్టర్లను విడుదల చేసిన స్వరాజ్ ట్రాక్టర్స్!



Next Story