- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: రిజిస్టర్ కాని ప్లాట్‌ఫారమ్‌లలో ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్టర్లను హెచ్చరించిన సెబీ
రిజిస్టర్ కాకుండా లోన్ సెక్యూరిటీలను అందించే వెబ్‌సైట్‌లలో జరిగే లావాదేవీల వల్ల సహాయం చేయడం క్లిష్టంగా ఉంటుంది

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించింది. రిజిస్టర్ కాకుండా అన్‌లిస్టెడ్ సెక్యూరిటీలను ఆఫర్ చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను నమ్మవద్దని, ఇన్వెస్టర్లు వాటికి దూరంగా ఉండటం మంచిదని సెబీ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అటువంటి ప్లాట్‌ఫామ్‌ల వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరణ ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి అనుమతులు పొంది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను నిర్వహించే స్టాక్ బ్రోకర్ల ద్వారా మాత్రమే లావాదేవీలు చేసుకోవాలని పేర్కొంది. రిజిస్టర్ అవ్వని అలాంటి ప్లాట్‌ఫామ్‌లపై ఎటువంటి పర్యవేక్షణ ఉండదు. అందులో ఇన్వెస్ట్ చేసేవారి పెట్టుబడులకు, వాటిపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సరైన సిస్టమ్ లేనందున ఇన్వెస్టర్లు మోసపోవద్దని సెబీ తెలిపింది. రిజిస్టర్ కాకుండా లోన్ సెక్యూరిటీలను అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్‌లలో జరిగే లావాదేవీల వల్ల సహాయం చేయడం క్లిష్టంగా ఉంటుంది. తాము పెట్టుబడి పెట్టే లోన్ సెక్యూరిటీలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే, ఇన్వెస్టర్లు తక్షణం సెబీకి తెలపాలని వెల్లడించింది.






