- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, బిజినెస్ బ్యూరో: సైబర్ మోసాల నుంచి రిటైల్ పెట్టుబడిదారులను రక్షించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కీలక ముందడుగు వేసింది. సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలలో ఉపయోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) అడ్రస్ ప్రామాణికతను ధృవీకరించడానికి 'సెబీ చెక్' అనే కొత్త టూల్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 1న దీన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా రియల్ టైమ్‌లో నిధులు సేకరించే రిజిస్టర్డ్ మధ్యవర్తుల యూపీఐ అడ్రస్‌లను ధృవీకరించడంలో పెట్టుబడిదారులకు సహాయపడుతుంది. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సేకరించే దాదాపు 9,000 సెబీ-రిజిస్టర్డ్ మధ్యవర్తులకు, ఎక్కువగా బ్రోకర్లకు వర్తిస్తుంది. 'సెబీ చెక్' ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే.. 'పెట్టుబడిదారుల భద్రత కోసం ఒక వ్యవస్థాగత పరిష్కారాన్ని ప్రవేశపెడుతున్నాం. సైబర్ మోసాల నుంచి రక్షణకు ఈ 'సెబీ చెక్' ఫీచర్‌ను తీసుకొస్తున్నాయి. బ్రోకర్ యాప్‌ల మాదిరిగానే కనిపించే కొన్ని యాప్‌లు పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారు. వాటి నియంత్రణ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల సొమ్ముకు రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో నకిలీ యాప్‌లను వెరిఫై చేయాలని ప్లేస్టోర్‌ను కూడా కోరుతామని అన్నారు.






