- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి సెబీ అనుమతి
జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అందుకుంది

దిశ, బిజినెస్ బ్యూరో: బ్లాక్‌రాక్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా భారత మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సెబీ నుంచి అనుమతి పొందినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్) మంగళవారం ప్రకటించింది. జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అందుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కొత్త అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులకు డేటా ఆధారిత, డిజిటల్ యాక్సెస్ కలిగిన మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను అందిస్తుంది. తద్వారా భారతీయ పెట్టుబడుల రంగంలో కొత్త అధ్యాయానికి నాంది అవుతుందని జియో బ్లాక్‌రాక్ వెల్లడించింది. దేశీయ జియో ఫైనాన్షియల్, అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ కలిసి జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జియో బ్లాక్‌రాక్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ఏర్పాటు చేశాయి. వీటిలో రెండు కంపెనీలకు సగం సగం వాటా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలో జియో, బ్లాక్‌రాక్ సంయుక్తంగా రూ.117 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. కంపెనీ కార్యకలాపాల కోసం 2023, అక్టోబర్‌లోనే అనుమతి కోరిన కంపెనీలకు తాజాగా అనుమతులు లభించడంతో మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి మార్గం సుగమం అయ్యింది.






